Lyrics: Amara Kumari
Tune : Ratnam Singer: Lillian Christofer Music : Sudhakar Rella
చాలయ్యా చాలయ్యా నీ కృప చాలయ్యా
మేలయ్యా మేలయ్యా నా కదియే మేలయ్యా
నీ కృపయే చాలయ్యా నాకదియే మేలయ్యా
నీ దయనే చూపయ్య నాకదియే ఘనతయ్యా
||చాలయ్య చాలయ్య||
1.ప్రార్థించు వారికి కృప చూపుటకు ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా
దుఃఖించువారికి ఉల్లాస వస్త్రమును
దయచేయు దేవుడవు నీవే యేసయ్యా
ప్రేమించి మన్నించి రక్షించువాడవు
కరుణించి కృపచూపి కాపాడువాడవు
||నీ కృపయే చాలయ్యా||
2.దీనాత్ములకు దయచూపుటకు
కరునసంపన్నుడవు నీవే యేసయ్యా
నిత్యమైన కృపతో వాత్సల్యము చూపి
సమకూర్చు వాడవు నీవే యేసయ్యా
ఓదార్చి బలపరచి నడిపించువాడవు
దీవించి ఘనపరచి హెచ్చించువాడవు
||నీ కృపయే చాలయ్యా||
0 Comments