నూతనమైన కృపా - నవనూతనమైన కృపా

శాశ్వతమైన కృపా - బహు ఉన్నతమైన కృపా......

నిరంతరం నాపై చూపిన - నిత్యతేజుడా యేసయ్య

నీ వాత్సల్యమే నాపై చూపించిన



నీ ప్రేమను వివరించనా

నను నీకోసమే ఇల బ్రతికించిన

జీవాధిపతి నీవయ్య

ఇదే కదా నీలో పరవశం

మరువలేని తీయ్యని జ్ఞాపకం (2) || నూతనమైన||

1. నా క్రయధనముకై రుధిరము కార్చితివి

ఫలవంతములైన తోటగా మార్చితివి (2)

ఫలితముకొరకైన శోధన కలిగినను

ప్రతిఫలముగా నాకు ఘనతను నియమించి

ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి

అన్నివేళలయందు ఆశ్రయమైనావు

ఎంతగా కీర్తించినా నీ రుణమే నే తిర్చగలనా || ఇదే కదా||


2.నీ వశమైయున్న ప్రాణాత్మదేహమునును

పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను (2)

పలు వేదనలలో నీతో నడిపించి

తలవంచని తెగువ నీలో కలిగించి

మదిలో నిలిచావు మమతను పంచావు

నా జీవితమంతా నిను కొనియాడెదను

ఎంతగా కీర్తించినా...

నీ రుణమే నే తిర్చగలనా || ఇదే కదా||

3. సాక్షిసముహము మేఘమువలె నుండి

నాలో కోరిన ఆశలు నెరవేరగా (2)

వేలాది దూతల ఆనందము చూచి

కృపమహిమైశ్వర్యం నే పొందిన వేళ

మహిమలో నీతోనే నిలచిన వేళ

మాధుర్యలోకాన నిను చూచిన వేళ

ఎంతగా కీర్తించినా...

నీ రుణమే నే తిర్చగలనా || ఇదే కదా||